Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 November 2025, 9:03 pm Posted by : Anjaneyulu Dega

ప్రజాశాంతికి భంగం కలిగించిన నిందితులపై కేసు నమోదు

తాళ్ళగురిజాల ఎస్.ఐ రామకృష్ణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గణేష్ నిమజ్జనం సందర్భంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిన నిందితులపై కేసు నమోదు చేశామని తాళ్ల గురజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు.. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుధకలాన్ గ్రామంలో సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జనం ఉత్సవాల దగ్గర గొడవ జరుగుతుందని డయల్ 100 కాల్ రావడంతో స్పందించి పోలీస్ సిబ్బంది అయిన శివశంకర్ HG- శివ కృష్ణ లను గణేష్ నిమజ్జనం ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతానికి పంపించాము.. అక్కడ గొడవ పడుతున్న వ్యక్తులను గమనించి, ఎలాంటి నేరాలు జరగకుండా గొడవ పడొద్దని సముదాయిస్తున్న సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దౌర్జన్యంగా దాడి చేసి పోలీసు విధులను ఆటంకపరిచారు.. వెంటనే అట్టి వ్యక్తులపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాము.. దాడికి పాల్పడిన నిందితులు చింతకుంట్ల గణేష్, చింతకుంట్ల మహేష్ గా గుర్తించి గాలింపు మొదలుపెట్టాము.. బుధకాలన్ గ్రామంలో వారి ఇంటి దగ్గర నిందితులను పట్టుకొని అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కి తరలించామని తెలిపారు.. ప్రజాశాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు..