ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు
దేవాపూర్ ఎస్.ఐ గంగారం

ఆంజనేయులు న్యూస్, దేవాపూర్: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొడవకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దేవాపూర్ ఎస్.ఐ. గంగారం శనివారం తెలిపారు… ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ.. కొండాపూర్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ వద్ద శుక్రవారం సాయంత్రం దేవపూర్ గ్రామానికి చెందిన బోర్లకుంట ప్రణయ్, జంగు అనే వ్యక్తులు డబ్బుల విషయంలో గొడవ పడుతున్నారు. అక్కడ ఉన్న అచ్యుత్ రావు గూడెంకు చెందిన గూడెం రామచందర్ ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించగా గూడెం రామచందర్ పై, బోర్లకుంట ప్రణయ్, రామ్టెంకీ చంద్రయ్య, చునార్కర్ రాజేష్, కోమటి చేను గ్రామానికి చెందిన జాడి కిరణ్, దుర్గం శేఖర్, బోర్లకుంట ప్రవీణ్, జాడి సాగర్ అనే వ్యక్తులు పదజాలంతో దూషిస్తూ అతనిపై దాడి చేసి చంపుతామని బెదిరించారు.. బాధిత వ్యక్తి గూడెం రామచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి. ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని, అదేవిధంగా, గతంలో కూడా నేర చరిత్ర కలిగిన నిందితుడు బోర్లకుంట ప్రణయ్ పై రౌడీషీట్ ఓపెన్ చేయబడుతుందని ఎస్.ఐ. తెలిపారు. ప్రజా శాంతికి భంగం కలిగించే వ్యక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ. గంగారం హెచ్చరించారు..