బెట్టింగ్ మాయలో దొంగగా మారిన ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దుర్వ్యసనాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయనడానికి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2 శాఖలో క్యాషియర్ నగదు, ఆభరణాల తస్కరణ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఉన్నత చదువు చదివి, జాతీయ బ్యాంకులో కొలువు దక్కించుకుని, రూ. వేలల్లో జీతం పొందుతూ భార్యాపిల్లలతో సంతోషంగా జీవనం సాగించాల్సిన ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై దొంగగా మారి కటకటాలు లెక్కించే దుస్థితికి దిగజారిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. తన అవసరాలకు దొంగగా మారడమే కాకుండా మరికొందరిని పావులుగా వాడుకుని వారినీ నిందితులుగా...