పెట్రోల్ బంక్ లో నకిలీ నోటు కలకలం.!
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ హెచ్ పి పెట్రోల్ బంకులో శుక్రవారం రాత్రి నకిలీ నోటు కలకలం సృష్టించింది. నాయకిని పోశం అనే వ్యక్తి కారులో 1000 పెట్రోల్ పోయించుకొని, 2000 ఫోన్ పే ద్వారా చెల్లించగా, మిగిలిన 1000 రూపాయల బ్యాలెన్స్ ఇచ్చారు. అందులో ఒక 200 రూపాయల నోటును వైన్స్ లో ఇవ్వగా అది నకిలీదని తేలింది. తడిపితే దాని రంగు పోయింది. పోశం పెట్రోల్ బంకుకు వెళ్లి అడిగితే, తమకు ఏమీ తెలియదని, ఆ...