నకిలీ జర్నలిస్టుల ముసుగులో బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పత్రికా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తూ జర్నలిస్టుల పేరుతో ముసుగులు వేసుకుని ప్రజలను బెదిరించే ఘటన గురువారం మంచిర్యాలలో వెలుగులోకి వచ్చింది. ఓ న్యూస్ ఛానల్ పేరిట నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకుని బార్ మేనేజర్లను, వ్యాపారులను ఉచిత సేవలకు ఇవ్వాలని ఒత్తిడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టౌన్ ఎస్సై మజారోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్పీ రోడ్లోని శ్రీ సాయి శ్రీనివాస బార్లో సయ్యద్ సిరాజ్ అనే వ్యక్తి మద్యం సేవించి ఉచిత...