Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 1:14 pm Posted by : Unknown Author

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి.

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి.

కొమురం భీం అససిఫాబాద్ జిల్లా ప్రతినిధి,కాగజ్ నగర్ : కాగజ్ నగర్ మండలంలోని ఉపాధ్యాయులకు,స్వయం సహాయక సంఘ సభ్యులకు నవభారత్ సాక్షరత కార్యక్రమము (ఉల్లాస్ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బ్రాంచి సర్ సిల్క్ నందు నిర్వహించడం జరిగిందని బుదవారం రోజున తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వయోజన విద్య కోఆర్డినేటర్ నాగరాజు హాజరై మాట్లాడుతూ 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని, గ్రామంలోని ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘ సభ్యులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

జిల్లా కమ్యూనిటీ ఆఫీసర్ కటకo మధుకర్ మాట్లాడుతూ, ఉల్లాస్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ఎంపిక చేసిన కార్యకర్తల ద్వారా నిరక్షరాశులను చదవటం, రాయటం, అంకెలు గుర్తించడం వంటి సామర్థ్యాలు నేర్పించాలని సూచించారు. మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులు అయినా వయోజనులను దూర విద్యా విధానం ద్వారా పదవ తరగతి పరీక్షలు రాయించి వారిని పై చదువులకు వెళ్లేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్లుగా సుందిళ్ల రమేష్, జిత్తు నాయక్ వ్యవహరించగా మండలంలోని ఉపాధ్యాయులు స్వయం సహాయక సంఘ వాలంటీర్లు మరియు ఎంఐఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.