చెత్త గుట్టలు.. డంపింగ్ యార్డులపై నిర్లక్ష్యం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నగరపాలక సంస్థలోని అండాలమ్మకాలనీ నివాస గృహాల సమీపంలో తాత్కాలిక చెత్త డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నారు. అక్కడ రెండు ఎకరాల స్థలంలో చెత్తను వేస్తుండటంతో గుట్టలుగా పెరిగింది. తరచూ కార్మికులు కాల్చేస్తుండటంతో పొగతో సమీప కాలనీల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ ప్రక్రియ ఎప్పుడో నిలిచిపోయింది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో శాశ్వత డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, వెలువడుతున్న చెత్తకు అనుగుణంగా డంపింగ్ యార్డు స్థలాలు ఏర్పాటు చేయడం...