Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 7:31 pm Posted by : Unknown Author

నిరంతర వర్షాలు – అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ.

నిరంతర వర్షాలు – అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్పీ.

కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,అగస్ట్18, :ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దు, ఏ ఆపద వచ్చిన వెంటనే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670551 కు సమాచారం అందించగలరని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు.సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఏ ప్రమాదం సంభవించిన వెంటనే పోలీస్ వారికీ సమాచారం అందించాలని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో పోలీస్ అధికారులను, సిబ్బందిని సిద్ధం చేశామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు.వర్షాల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై గాని, ఇతర ప్రదేశాలలో గాని సమస్యలు తలెత్తిన వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలపై తక్షణ స్పందన కలిగే విధంగా పోలీస్ అధికారులను సిద్ధం చేశామని తెలిపారు.వాగులు మరియు చెరువులను అనుకోని ఉండే ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువులు కాపరులు వాగులు, వంకల వైపు వెళ్లరాదని, గ్రామాలలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేందుకు గస్తీ పోలీసులను అప్రమత్తంగా ఉండేలా ఆదేశించామని ఎస్పీ తెలిపారు.నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670551 కు సమాచారం అందించగలరు. పోలీస్ శాఖ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతుంది అని జిల్లా ఎస్పీ తెలిపారు.