Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 10:11 pm Posted by : Anjaneyulu Dega

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూచిపూడి కళాకారుల ప్రదర్శన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు (ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.. ఈ గర్వకారణమైన స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని “శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్ మరియు గురువు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత, నాట్య విభూషణి, అన్నం కల్పన ఎం.ఎ, కూచిపూడి” వారి శిష్య బృందంతో నాట్యకళ అయిన కూచిపూడి ద్వారా దేశభక్తి స్ఫూర్తిని ప్రతిఫలింపజేసే నాట్యప్రదర్శనను చేశారు.. ఈ ప్రదర్శనలో భాగంగా కూచిపూడి కళాకారులు భారత స్వాతంత్ర సంగ్రామాన్ని, మన దేశమాతకు అంకితభావాన్ని, మరియు మన సంస్కృతి గొప్పతనాన్ని నాట్యరూపంలో ఆవిష్కరించారు.. ఈ కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రతిభకు గాను ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు, జిల్లా కలెక్టర్ కుమార దీపక్, డిసిపి భాస్కర్, నాట్య గురువు కల్పన కు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు..

ఈ సందర్భంగా నాట్య గురువు కల్పన మాట్లాడుతూ.. సంప్రదాయ సంగీతం, రాగాలు, నాట్యాభినయంతో కూడిన ఈ ప్రదర్శన, మన దేశ గొప్పతనాన్ని తెలియజేసే కళాత్మక ఆవిష్కరణగా నిలుస్తుందని, మన భారతదేశ సౌందర్యాన్ని, యోధుల త్యాగాన్ని, మరియు ప్రజల ఐక్యతను కూచిపూడి రూపంలో ప్రదర్శన చేయడం ఇది ఒక అవిస్మరణీయ అనుభూతినిస్తుందని తెలిపారు..