కార్మెల్ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎసిసిలో గల కార్మెల్ కాన్వెంట్ సీబీఎస్ఇ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సిస్టర్ మరియా అగస్టీన్ హాజరయ్యారు.. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.. ఈ సందర్భంగా సిస్టర్ మరియా మాట్లాడుతూ.. విద్యార్థులకు 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్య్రం కోసం...