మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే  ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం వట్టివాగు కాలనీలో గల గిరిజన ప్రాథమిక పాఠశాల/ దిశా ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ...