మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణ మార్కెట్ లో నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనాలపై పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టించామని, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనదారులను, మరియు నెంబర్ ప్లేట్స్ తీసివేసిన, విరగొట్టిన, నెంబర్ ప్లేట్స్ కనిపించకుండా స్టిక్కర్స్ అతికించిన వాహనాలను పట్టుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించి అనంతరం నూతన నెంబర్ ప్లేట్లను బిగించామని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వ్యక్తులు వాహనాలు నడపడం. ఇది చట్టవిరుద్ధం మరియు ప్రమాదకరమైనదని, వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి ఉండాలని తెలిపారు.. ఇక ముందు నెంబర్ ప్లేట్స్ తీసివేసినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హచ్చరించారు.. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సైలు ఏఎస్ఐలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..