డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్
జర్నలిస్టుల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఆవేదన
పదిహేను రోజుల్లో నలుగురు జర్నలిస్టుల మృతి చెందడం బాధాకరమని వెల్లడి
మంచిర్యాల జిల్లా కార్యవర్గం ఎన్నిక, నూతన అధ్యక్షుడిగా పార్వతి సురేష్, ప్రధాన కార్యదర్శి గా బండి రవి, జిల్లా కోశా ధికారి గా డేగ ఆంజనేయులు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పరిస్థితులు చాలా ఆవేదనకరంగా ఉన్నాయని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ బాపోయారు. గడచిన 15 రోజుల్లోనే నలుగురు జర్నలిస్టులు మృత్యువాత పడటం ఆవేదనకరమని కూడా ఆయన చెప్పారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గ ఏర్పాటులో భాగంగా శనివారం అయిన జిల్లా కేంద్రానికి వచ్చారు. స్థానిక సీ-4 ఛానల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరుణాకర్ మాట్లాడారు. పత్రిక, మీడియా చానల్స్ యాజమాన్యాల లక్ష్యాలు, వేధింపులకు తాళలేక మానసిక ఒత్తిళ్లకు లోనై జర్నలిస్టుల ముద్రవాతం మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల ఆత్మహత్యలపై స్పందించి ప్రత్యేక కార్యచరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గ విషయానికొస్తే జిల్లా కమిటీలు దాదాపు అన్ని మండలాలకు ప్రాతినిధ్యం తగ్గేలా చూస్తామనేని హామీ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే రెండు మూడు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకొని అధికారికంగా జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించను కరుణాకర్ వెల్లడించారు.. కాగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పార్వతి రాజేష్ కుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు పరశురామ్, దుస్స శివప్రసాద్, ఈదునూరీ సారంగరావు ఆధ్వర్యంలో కమిటీ నియమించడం జరిగింది..
నూతన జిల్లా కమిటీ సభ్యులు వివరాలు:

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా పార్వతి సురేష్ కుమార్, కోశాధికారిగా డేగ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా బండ రవి గౌడ్ ను ఎన్నుకోగా కమిటీ సలహాదారులుగా బీరం రవి, మట్టే రవీందర్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా కనుకుంట్ల వెంకట రాజ్, అల్లంల కుమార స్వామి, మామిడాల రవీందర్, పినుమల్ల గట్టయ్య, సంయుక్త కార్యదర్శులుగా కంది రాజేష్, కొల్లూరి తిరుపతిని ఎన్నుకున్నారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి కమిటీ త్వరలో నియమించడం జరుగుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాకర్ వివరించారు..