Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 11:22 am Posted by : Anjaneyulu Dega

స్నేహం పేరుతో బాలికను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన బాలుడు

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఘటన

సోషల్ మీడియాలో పరిచయమైన బాలిక

ఇద్దరి మధ్య చాటింగ్‌ను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించిన బాలుడు

నగ్న వీడియోను స్నేహితులకు షేర్ చేసిన నిందితుడు

ఇద్దరు బాలురు సహా 8 మంది అరెస్ట్

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: గుడిహత్నూరు మండలంలో ఓ బాలుడు (16) దారుణానికి తెగబడ్డాడు. సోషల్ మీడియాలో పరిచయమైన బాలిక (16)ను బెదిరించి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. ఆపై వాటిని తన స్నేహితులకు షేర్ చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు మైనర్లు సహా మొత్తం 8 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..

పోలీసుల కథనంప్రకారం: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి సోషల్ మీడియా ద్వారా బాధిత బాలిక పరిచయమైంది. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్‌ను ఉపయోగించుకున్న బాలుడు.. దానిని ఆమె తల్లిదండ్రులకు చూపించకుండా ఉండాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక అలాగే చేసింది. ఆ వీడియోను రికార్డు చేసిన బాలుడు దానిని తన స్నేహితులకు షేర్ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. బాలికను మానసికంగా, శారీరకంగా వేధించిన ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు..

నిందితుల వివరాలు:

ఇద్దరు మైనర్లు, వంశీకృష్ణ(20), పవర్ తరుణ్(18), గుండల్వార్ వరుణ్(18), కారడ్ సుధీర్(28), ముర్కుటే విఠల్(23), సాబ్లె బాలవంత్ సింగ్(18) ఇద్దరు బాలురను నిజామాబాద్‌లోని జువైనల్ హోంకు, ఈ ఎనిమిది మంది పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు..