పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగాలంటే.. ప్రేమతో, ఓపికతో ఇలా చేయండి..!

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పిల్లలు చదవడం లేదని కొందరు తల్లిదండ్రులు కంగారు పడతారు. కోప్పడటం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తారు. కానీ వీటి వల్ల లాభం ఉండదు. ఇంకా చదువు అంటే విరక్తి పెరుగుతుంది. పిల్లలకు చదవాలని ఆసక్తి పెంచాలంటే కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..! పిల్లలు బడి నుంచి రాగానే బలవంతంగా చదివించొద్దు. బడిలో గంటల తరబడి క్లాసులు, హోంవర్క్, ఆటలు అన్నీ అయ్యాక అలసిపోతారు. కాస్త విశ్రాంతి, సరదాగా ఆడుకునే సమయం తర్వాతే చదవడం మొదలుపెడితే...