తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. శ్రీ చక్ర ఆర్ట్స్ లయన్ డా॥ రంజిత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్ 2025 ఫెస్టివల్ ను హైదరాబాద్ త్యాగరాయగానసభ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. ఈ నాట్యోత్సవంలో మంచిర్యాల జిల్లా నుండి శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, గురువు, నేషనల్ లెవెల్ డా॥ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత, నాట్య విభూషణి శ్రీ అన్నం కల్పన శిష్యలు సాధిక, అలోఖి, కూచిపూడి నాట్య ప్రదర్శనలు చెశారు. వారి ప్రతిభను గుర్తించి. “గరుడ అవార్డు” ను ప్రధానం చెసారు.. అనంతరం గరువు కల్పన ను “స్వర్ణ నంది అవార్డ్” తో ఘనంగా సన్మానించి సత్కరించారు..