లే-అవుట్లను నిబంధనలకు లోబడి అనుమతించాలి
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో భూముల లే-అవుట్ల కొరకు అందిన దరఖాస్తుల సంబంధిత భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు లోబడి అనుమతించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో లే-అవుట్ కొరకు అందిన దరఖాస్తు సంబంధిత భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల అభివృద్ధి, ఇండ్ల నిర్మాణం, వెంచర్ల ఏర్పాటులో భాగంగా లే-అవుట్ కొరకు అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా...