ఎల్.ఆర్.ఎస్. రుసుము చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఎల్.ఆర్.ఎస్. –2020 పథకంలో భాగంగా లే-అవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల నుండి రుసుము వసూలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో ఎల్.ఆర్.ఎస్. రుసుము...