Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 8:41 pm Posted by : Anjaneyulu Dega

ఆదివాసుల గుండెల్లో గుబులు.. మావోయిస్టులార సిగ్గు సిగ్గు..

మావోయిస్టులపై ఆదివాసుల వ్యతిరేక పోస్టర్లు కలకలం.

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం లోని కరవెల్లి గ్రామంలో ఆదివాసీ యువజన రాష్ట్ర సంఘనాయకులు మావోయిస్టులకు వ్యతిరేకంగ శుక్రవారం రాత్రి పోస్టర్లు విడుదల చేయడం జిల్లాలో కలకలం రేపింది. ఈ పోస్టర్ లో “ఆదివాసుల మీద మావోయిస్టుల అప్రకటిత యుద్ధం..! కర్రెగుట్టల్లో మందుపాతరలు మావోయిస్టులారా.. తీరవా మీ రక్త దాహాలు.అడవుల్లో బాంబులు.. ఆదివాసుల గుండెల్లో గుబులు.. మావోయిస్టులారా.. సిగ్గు సిగ్గు” అనే పేరు తో పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ పోస్టర్ లు ఆదివాసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం నాయకులు  విడుదల చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఈ పోస్టర్ లపై ఎస్ఐ నరేష్ ను వివరణ కోరగా మండలం లో రవీంద్ర నగర్, కరవెల్లి గ్రామాలలో ఆదివాసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం నాయకులు విడుదల చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. అడవిలో మావోయిస్టులు బాంబులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆదివాసిలు అడవిపైన జీవనఆధారం చేసుకొని బ్రతుకుతూ తరుణంలో మావోయిస్టులు అడవిలో పోలీసుల కోసం అమర్చిన బాంబులకు ఆదివాసి జనాలుగురి అవుతున్నారని పేర్కొన్నారు.. ఇటువంటి నీచమైన చర్యలు చేపట్టొద్దని మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి సంఘాలు పోస్టర్లు విడుదల చేసినట్లు తెలుస్తుందన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నామన్నారు.