Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 7:33 am Posted by : Anjaneyulu Dega

కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

పోలీసులకు సమాచారం అందించిన అధికారులు

అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదన్న పోలీసులు

ఆంజనేయులు న్యూస్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా: జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు అందాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలెక్టరేట్ ఆవరణలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు, బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.