Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 12:04 pm Posted by : Anjaneyulu Dega

నోట్లో మూత్రం పోసి గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గులు.!

తెలంగాణలో అదుపులో లేని లా అండ్ ఆర్డర్..

హోమ్ శాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి

దాహం వేస్తుంది అంటే నోట్లో మూత్రం పోసి గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గులు

నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనానికి వచ్చిన యువతి గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు

ఆంజనేయులు న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లాలో ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి రాత్రి 10 గంటల సమయంలో ఆలయ సమీపంలో బహిర్భూమికి వెళ్ళగా అక్కడే మద్యం తాగుతున్న స్థానిక ఆటో డ్రైవర్లు, స్థానికులు ఏడు గురు కలిసి దుస్తులు విప్పి, విచక్షణారహితంగా కొడుతూ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.. మద్యం సేవిస్తూ ఉదయం 4 గంటల వరకూ ఒకరి తరువాత మరొకరు ఈ ఘాతుకానికి పాల్పడగా దాహం వేస్తుందని అడిగిన ఆ మహిళ నోట్లో మూత్రం పోసి మరీ లైంగిక దాడికి పాల్పడి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, పుస్తెలు, కమ్మలు దోచుకొని వెళ్లారు..