Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 3:38 pm Posted by : Anjaneyulu Dega

అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ మండలంలో 3217005, 3217012 నంబర్లు గల చౌక ధరల దుకాణాలలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదవారి కడుపు నిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌక ధరల దుకాణాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..