ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు అతి పెద్ద గుడ్ న్యూస్! రేషన్ కార్డు కలిగిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఉగాది కానుక అందజేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి ఆయన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "ఇప్పటివరకు శ్రీమంతులే తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోషక విలువలతో కూడిన సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించాం" అని...