సర్వర్ ఎప్పుడు పని చేస్తుందో?
వాహనాలను వదిలి ఇంటికి వెళ్లిపోయిన రైతులు

ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్న రైతులు
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లావ్యాప్తంగా సిసిఐ కొనుగోళ్లు చేపడుతున్న ఆధార్ అథెంటిఫికేషన్ (రాయ్టేల్ సర్వర్) మొరయించడంతో రైతులు నానా విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి పత్తి పంటను పండించి అమ్మేందుకు సీసీఐ కేంద్రాల వద్దకు వస్తే తేమ పేరుతో ఒక విధంగా, నాణ్యత లేదని మరో విధంగా ఇలా రకరకాలుగా రైతులు ఇబ్బందులను పడుతూ పంటకు సరైన గిట్టుబాటు ధరలేక అవస్థలు పడుతూనే ఉన్నారు. మంచి ధర కోసం సిసిఐ అధికారులకు పత్తిని అమ్మే రైతులకు గత పది రోజుల క్రితం నుండి ఆధార్ అథెంటిఫికేషన్ కు సంబంధించిన సర్వర్ పనిచేయకపోవడంతో కొనుగోల్లు నిలిచిపోవడంతో జిల్లా వ్యాప్తంగా 18 జిన్నింగు మిల్లులలో రైతులు తెచ్చిన వాహనాలను అలాగే వదిలేసి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రైవేట్ లో అమ్ముదామంటే 500 నుండి 1000 రూపాయల తేడా, సీసీఐ కేంద్రాలకు తీసుకువస్తే సర్వర్ మోరాయించడం వలన వాహనాలు కిరయి ఒక్క రోజుకు1000 రూపాయల వరకు వెయిటింగ్ చార్జ్, డీసీఎం వాహనాలు అయితే రెండు నుండి మూడు వేల వరకు వెయిటింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తుందని దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రానికి సంబంధించిన సమస్య కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధవహించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.
సర్వర్ పని చేయడం లేదు..!
– గజ్జల భీమేష్ రైతు చిర్రకుంట

గత పది రోజుల నుండి సీసీఐ అధికారులు సర్వర్ పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో కొనుగోలు జరగడం లేదు. 30 క్వింటాళ్ల పత్తిని బొలెరో వాహనంలో తీసుకువచ్చాను వాహన యజమాని రోజుకు వెయిటింగ్ చార్జ్ 1000 రూపాయలు కట్టాలి అని అంటున్నారు. న్యాయం జరిగే విధంగా అధికారులు చూడాలి
ఆర్థికంగా నష్టపోతున్నాం.!
– జాడి వాసుదేవ్ అంకుసాపూర్

మా చుట్టాల పెళ్లి ఉండడంతో పత్తి అమ్ముదామని జిన్నింగు మిల్లుకు వస్తే అధికారులు కొనుగోలు చేపట్టడం లేదు. ఐచర్ వాహనంలో పత్తి ని తీసుకుని వచ్చాను రోజుకు 2000 రూపాయలు వెయిటింగ్ చార్జ్ ఇవ్వాలని యజమాని అంటున్నాడు. డబ్బులు కట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
సిసిఐ అధికారులతో మాట్లాడుతున్నాం..!
– ఆశ్వక్ జిల్లా మార్కెటింగ్ అధికారి
ఈ విషయమై జిల్లా మార్కెటింగ్ అధికారి ఆశ్వక్ ను సంప్రదించగా సర్వర్ పని చేస్తేనే ఆధార్ అతనిటిఫికేషన్ జరుగుతుందని దీంతో ఆధార్ కు లింక్ ఐన బ్యాంకు ఖాతాలోకి రైతులకు సంబంధించిన నగదు జమ అవుతుందని తెలిపారు. కేంద్రం పరిధిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు..