రైతుల ఖాతాలలో 166 కోట్ల 24 లక్షల రూపాయలు జమ

జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 319 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 166 కోట్ల 24 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతిపాదించిన 326 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 319 కొనుగోలు ,కేంద్రాల ద్వారా 1 లక్షా 18 మెట్రిక్‌ టన్నుల...