Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 1:07 pm Posted by : Anjaneyulu Dega

ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం

ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు, పెండింగ్ లో ఉన్న జీతం బిల్లు కోసం పాఠశాల ప్రిన్సిపాల్, లంచం అడుగుతున్నాడని, ఏసీబీ కి ఫిర్యాదు చేయడంతో గురువారం ఉదయం రైడ్ చేసి ప్రిన్సిపాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ అధికారులు.. ఖమ్మం జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బోధన నిర్వహిస్తున్న తెలుగు  ఉపాధ్యాయురాలు సంధ్యారాణి శాలరీ చేయడానికి ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ  రూ.10 వేలు డిమాండ్ చేశారు. వాటి కోసం పది రోజులుగా ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో సంధ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు రూ.2 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపాల్ కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా ఆయన అటెండర్, రామకృష్ణకు ఇవ్వమని చెప్పాడు. టీచర్ సంధ్య అటెండర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం దాడి చేసి పట్టుకుంది.