ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి విడుదల

రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న వరదనీటిని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగువ ప్రాంతాలకు ప్రణాళికబద్దంగా విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్,...