మంత్రి పీఏ అని చెప్పి.. గురుకులాల్లో అక్రమ దందా
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే తల్లి తండ్రుల ఆశలను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రిన్సిపల్ తో కుమ్మకై రూ.20 వేల నుంచి రూ.40 వేల చొప్పున వసూలు చేసి గురుకులాల్లో పిల్లలకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ నేత మంత్రి సీతక్కతో దిగిన ఫొటోలను చూపుతూ, ప్రజలను మభ్యపెడుతూ ఇష్టానుసారంగా డబ్బులను తీసుకుంటూ ప్రవేశాలు కల్పిస్తుండగా, కాగజ్నగర్ పట్టణంలో సైతం కొందరు దళారులు ఇదే విధంగా చేస్తున్నారు. • అక్రమం వెలుగులోకి వచ్చిందిలా....