ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కసరత్తు
ఆంజనేయులు న్యూస్, కాగజ్నగర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్ల కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై కార్మిక వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మిల్లు పునఃప్రారంభమైన నాటినుంచి ఎన్నికలు నిర్వహించలేదు. ఇటీవలి పరిణామాలు కార్మికుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ అధికారులు అడుగులు వేస్తున్న తరుణంలో బరిలో ఎవరెవరు ఉండబోతున్నారనే విషయంపై చర్చించుకుంటున్నారు. మూతపడే సమాయానికి మిల్లులో ఉన్న 15 గుర్తింపు సంఘాలకు తమ సంవత్సర నివేదికలను అందజేయాలని డీసీఎల్...