భారీ వర్షాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోవు 2, 3 రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. గ్రామపంచాయతీలలో టాం-టాం ద్వారా అప్రమత్తత...