నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ముసాయిదాపై అందించిన సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తాం.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ముసాయిదాపై నిపుణులు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ అధికారులు అందించిన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నూతన ఆర్.ఓ.ఆర్. చట్టం ముసాయిదాపై విశ్రాంత రెవెన్యూ అధికారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, నిపుణులతో ఏర్పాటు చేసిన చర్చ కార్యక్రమానికి జిల్లా అదనపు...