మంచిర్యాలలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి షార్ట్ ఫిలింలో అవకాశం కల్పిస్తామని చెప్పి వారితో వ్యభిచారం చేయిస్తున్న వైనం బయటపడింది. ఈ వ్యవహారాన్ని బుధవారం మంచిర్యాల పోలీసులు బయటపెట్టారు.. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల సున్నం బట్టివాడకు చెందిన కరుణాకర్ అనే వ్యక్తి ఎల్ఐసీ ఆఫీసు ఎదురుగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంటిని లీజుకు తీసుకొని బెల్లంపల్లికి చెందిన శాతాని శంకర్ అనే వ్యక్తిని మేనేజర్ గా పెట్టినాడు శంకర్ గతంలో మీనాక్షి లాడ్జిలో పనిచేసిన...