ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన మేదరి సాగర్ హాజీపూర్...