కోల్కతా ఘటన – ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అన్ని ముఖ్య కూడళ్ల మీదుగా జరిగింది. అనంతరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ మాట్లాడుతూ. కోల్‌కత్తాలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్యులు రోడ్డెక్కారు....