ఘనంగా వరలక్ష్మీ వ్రతం.. పూజలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆధ్మాత్మిక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్డి కాలనీ రాంనగర్, తదితర కాలనీల్లో మహిళలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్మాత్మిక సంస్థ మహిళలు నాగమణి, మౌనిక మాట్లాడుతూ.. అమ్మవారికి పట్టు వస్త్రాలను అలంకరించి కుంకుమార్చన చేశారు. అమ్మవారికి ఒడి బియ్యం పోయడంతోపాటు మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు....