అడ్డంగా బుక్కైన లలితా జువెల్లరీ అధినేత..!

"డబ్బులు ఊరికే రావు"... ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: డబ్బులు ఊరికే రావు.. అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు చిక్కిపోయారు. ‘పక్క షాపులోనో వెరిఫై చేసుకోండి..’ అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే ఆయన.. జీఎస్టీ రిటర్న్స్‌లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జువెల్లరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (జీఎస్టీఆర్-9) పేరుతో రూ. 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు....