Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 August 2024, 10:44 am Posted by : Anjaneyulu Dega

గద్వాల ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి బుజ్జగింపులు!

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఆయన తిరిగి భారాసలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బుజ్జగించేందుకు మంత్రి వెళ్లినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్రెడ్డి గద్వాల నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో ఆయన భేటీ కావడంతో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్రెడ్డి ఇంటికి మంత్రి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.