Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 June 2024, 4:19 pm Posted by : anjudega

మహిళల రక్షణ, భద్రత షి టీం కర్తవ్యం

జిల్లా షీ టీం ఇంచార్జి మహిళ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజమోగిలి గౌడ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ బాలికల హై స్కూల్ లో  విద్యార్థులకి షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా షీ టీం జిల్లా ఇన్చార్జ్ సిఐ రాజమౌళి గౌడ్ మాట్లాడుతూ.. ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మంచిగా చదువుకోవాలని, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే సైబర్ నేరాల గురించి తెలిపారు. వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో షీ టీమ్ ఎస్.ఐ రాజేంద్రప్రసాద్, సిబ్బంది కానిస్టేబుల్ శ్రావన్ కుమార్, సతీష్, మరియు మహిళా కానిస్టేబుల్ జ్యోతి, పాఠశాల హెచ్.ఎమ్ పద్మావతి, ఉపాధ్యాయురాలు సుధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.