మనిషి జీవితంలో గొప్ప మార్పుకు చదువే ప్రధానం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మనిషి జీవితంలో గొప్ప మార్పుకు చదువు మాత్రమే ప్రధానమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం పాఠశాలల పున:ప్రారంభంలో భాగంగా బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల, రాపల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ లతో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...