ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణంలోని గోపాల్వాడకు చెందిన మటూరి కమల...