Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 June 2024, 10:34 pm Posted by : Anjaneyulu Dega

మందమర్రి లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

ఆంజనేయులు న్యూస్, మందమర్రి: లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రి 7th వార్డు లో పార్టీ శ్రేణులు హనుమన్డ్ల ప్రసాద్, వెంకట నర్సింగ్, మహిళ నాయకురాలు రాజేశ్వరి, మరియు వార్డు సభ్యులు తో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంద్దమర్రి 7th వార్డు లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం టపాకయలు పెల్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్   కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.