Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 May 2024, 6:13 pm Posted by : Anjaneyulu Dega

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు.