Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 May 2024, 11:38 am Posted by : Anjaneyulu Dega

ఎస్సీ హాస్టల్ లో ఊడిన పైకప్పు

 

ఎస్సీ హాస్టల్ లో ఊడిన పైకప్పు తప్పిన ప్రమాదం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. హాస్టల్లోని వరండా పైకప్పు పెచ్చులు ఊడి పడిన సమయంలో హాస్టల్ విద్యార్థులు వేసవి సెలవుల్లో ఉండడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. విద్యార్థులు ఉండి ఉంటే ప్రమాదానికి గురయ్యేవారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మళ్లీ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి హాస్టల్ భవనానికి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.