Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 May 2024, 10:12 pm Posted by : Anjaneyulu Dega

కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కలిసి గాంధీభవన్ కు వచ్చిన ఆయన.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. గాంధీభవన్ కు వచ్చే ముందు భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.