ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్‌కు లీవ్ ఇవ్వకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం కారణంగానే ఆ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తున్న వార్తలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్‌కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారని. అయినా...