Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 April 2024, 8:42 am Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు పెరిగినా.. అందని వైద్యం!

మెరుగైన వైద్యం కోసం వసతులు లేవు అని చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వ డాక్టర్లు

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలని, సాధారణ కాన్పులు జరిపించేలా చూడాలని సమావేశాల్లో తరచూ జిల్లా అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మారింది. గతంతో పోలిస్తే వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది సంఖ్య భారీగా పెరిగింది. కానీ ఆ స్థాయిలో వైద్య సేవలు మెరుగుపడనట్లు తెలుస్తోంది. ప్రతి చిన్న కేసును మంచిర్యాల, ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తూ వైద్యులు చేతులు దులుపుకొంటున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే వసతులు లేవని చెప్పి దాటవేస్తున్నారు. మండలంలోని మోవాడ్ పంచాయతీ పరిధిలో చింతగూడకు చెందిన గర్భిణి లక్ష్మీబాయికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు.. రెండు రోజుల కిందట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఇంకా మూడు వారాలు ఉందని చెప్పి పంపించారు. దీంతో కుటుంబీకులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రసవ సమయం దాటిందని చెప్పారని, గంట తరువాత మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు..