Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 April 2024, 8:49 am Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ స్థలంలో జోరుగా అక్రమ కట్టడాలు

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు.

పట్టించుకోని సంబంధిత అధికారులు

జిల్లా కలెక్టరేట్ భవనం సమీపంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాల్లో జోరుగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. నస్పూర్ లోని సర్వే నంబరు 64లో ప్రభుత్వ స్థలంలో అక్రమార్కులు బహిరంగంగా కట్టడాలు చేపట్టారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనానికి కూత వేటు దూరంలో దర్జాగా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆక్రమణపై విచారణ చేసి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.