లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డిప్యూటీ డైరెక్టర్
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్. మాసబ్ ట్యాంక్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ను జితేందర్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ కోసం కలిశాడు. అందుకు రూ.75 వేల లంచం అడిగాడు జగన్మోహన్. అంత ఇచ్చుకోలేనని జితేందర్ చెప్పడంతో రూ. 50 వేలు డిమాండ్ చేశాడు జగన్మోహన్. దీంతో నేరుగా జితేందర్ ఏసీబీ...