Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 March 2024, 9:52 am Posted by : Anjaneyulu Dega

మహిళల రక్షణ, భద్రత షి టీం బాధ్యత.

మహిళల భద్రత కు ప్రాదాన్యం.. వేదింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఎస్ఐ హైమ

ఆపదలో తోడుగా. మహిళలకు అండగా పూర్తి భద్రతనిస్తున్న రామగుండం కమీషనరేట్ షీ టీమ్స్‌

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో గల శ్రీ నందిని నృత్యాలయం గురువు కల్పన గారి విద్యార్థినిలు కు మంచిర్యాల షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ హైమా మాట్లాడుతూ… రామగుండం పోలీస్ కమిషనరేట్ లో మహిళల భద్రత ను దృష్టిలో ‘మీ భద్రతే మా లక్ష్యం’ అనే నినాదం తో “అభయ (మై ఆటో సేఫ్) అనే మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారని ఆట్టి అప్లికేషన్ ను అత్యవసర సమయం లో ఎలా ఉపయోగించాలి, దాని ఉపయోగంను విద్యార్థులకు టీచర్ లకు వివరించారు. ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడం షి టీం బాధ్యత అని , మహిళలు ఏదైనా సమస్య వస్తే దైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, స్కూల్ విద్యార్ధినిలకు సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, హక్ ఐ ఆప్ గురించి వివరించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి మహిళకు షీ టీమ్ సహాయం చేస్తాయని తెలిపారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు అత్యవసర సమయంలో డయల్ 100 కి, రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ 6303923700 నెంబర్, స్థానిక పోలీస్ అధికారులకు  ఫిర్యాదు చేయాలన్నారు, వెంటనే స్పందించి మీ రక్షణకై షీ టీమ్, పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు అదేవిధంగా ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్సై తో పాటు కానిస్టేబుల్ జి సతీష్, శ్రావణ్, మహిళా కానిస్టేబుల్ జ్యోతి, నాట్య గురువు కల్పన, విద్యార్థినిలు పాల్గొన్నారు.