మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం జప్తునకు కోర్టు ఆదేశం
ఆంజనేయులు న్యూస్ , మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 40 ఏండ్లుగా ఓ మహిళ న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఈ తీర్పు వెలువరించింది. దీంతో జప్తు ఆపేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని 478, 480 సర్వే నెంబర్లలోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు....